Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వామ్మో...నేను వారం కంటే ఎక్కువ డైట్ చేయలేను: అఖిల్ అక్కినేని

వారం రోజుల కంటే ఎక్కువ డైట్ పాటించలేనని టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని చెప్పాడు. ఓ టీవీ చానెల్ తో అఖిల్ మాట్లాడుతూ, తనకు వర్కవుట్ల కంటే ఆటలు ఇష్టమని చెప్పాడు. వారంలో ఒకరోజైనా క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతానని చెప్పాడు. సిక్స్ ప్యాక్ చేసే ఆలోచన లేదని చెప్పిన అఖిల్, డైట్ పాటించడం కష్టమన్నాడు. గత వారం రోజులుగా డైట్ పాటిస్తున్నానని, కానీ డైట్ పాటించడం తన వల్ల కాదని, వారం కంటే ఎక్కువ డైట్ ఫాలో అయితే ఫెయింట్ అయిపోతానని అఖిల్ చెప్పాడు. నేటి తన సినిమా ఆడియో వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అఖిల్ చెప్పాడు.

More Telugu News